15 ఏళ్ల బాలికపై కన్నతండ్రి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక

శనివారం, 8 ఏప్రియల్ 2023 (18:50 IST)
రోజు రోజుకీ మనిషి మృగంలా మారుతున్నాడు. వావి వరసలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా ఓ తండ్రి కామాంధుడిగా మారి…15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. విశాఖ పెదగంట్యాడ మండలం గంగవరంలో.. కన్నతండ్రి కామాంధుడై కూతుర్ని కాటేశాడు. 15 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేశాడు. దీంతో గర్భవతి అయింది ఆ బాలిక. మేనమామ ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు