పోసాని అరెస్టు నేపథ్యంలో వైకాపా నేతలు నోటికి పని చెప్పారు. ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను బండ బూతులు తిట్టడాన్ని వారు బహిరంగంగా సమర్థిస్తూ పోసాని అరెస్టును ఖండిస్తున్నారు.
మరోవైపు, అనంతపురానికి చెందిన జనసేన నేత జోగిమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైంది. 196, 353(2), రెడ్ విత్ 2(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోసానిపై ప్రస్తుతం 11 కేసులు నమోదైవున్నాయి.