ఏలూరు తూర్పు వీధికి చెందిన ఒక వివాహిత భర్త అన్‌డెఫినెటెడ్ స్కిజోప్రీనియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. అంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగి మంచానికే పరిమితమై ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ డివిజన్ మాజీ కార్పొరేటర్ కౌలూరి చంద్రశేఖర్ ఆ వివాహితపై కన్నేశాడు. ఆమె వెంటపడుతూ ఎప్పటి నుంచో నీపై కోరిక ఉంది తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. 'నీ భర్త అమాయకుడు కాబట్టి నిన్ను ఉంచుకుంటాను. నాతో ఉంటే నీ భర్తకు రావాల్సిన ఆస్తుల వాటాలను పెద్ద మనిషిగా ఉండి సక్రమంగా ఇప్పిస్తాను. లేదంటే నీకు చిల్లిగవ్వ కూడా దక్కనివ్వ'నంటూ బెదిరింపులకు దిగాడు. అప్పటికీ లొంగక పోవడంతో ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలని ప్లాన్ వేశాడు.
ఆ వివాహిత భర్త సోదరుడితో స్నేహం చేసిన మాజీ కార్పొరేటర్.. ఆ వంకతో ఇంటికి వెళుతూ వేధించడం మొదలు పెట్టాడు. దీనికి మరిది కూడా వత్తాసు పలకడంతో ఆమె పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో గత నెల 15న మాజీ కార్పొరేటర్ చంద్రశేఖర్ వివాహిత మరిదితో కలిసి ఆమె ఇంటికి వెళ్లాడు. 'ఏంటీ ఎంత చెప్పినా మాట వినవా. అందుకే నేరుగా వచ్చాం. నీ మరిది ఎదుటే నిన్ను రేప్ చేస్తా'నంటూ బలాత్కరించబోయాడు.