చాలా వేగం... 10 నిమిషాల్లో చెప్పులు వేయిస్తా జ‌గ‌న్.... జేసీ ప్రభాక‌ర్ రెడ్డి(Video)

శుక్రవారం, 3 జూన్ 2016 (15:39 IST)
క‌ర్నూలు: జ‌గ‌న్... ఏం మాట్లాడుతున్నావ్... సంస్కారం కాదు. మ‌న ఇంటా వంటా లేదు చెప్పులు వేయించ‌డం. నీపై ప‌ది నిమిషాల్లో చెప్పులు వేయిస్తా... అయినా సంస్కారం కాదు... ఈ చెప్పులు వేయించే సంస్కృతి అంటూ... క‌ర్నూలు జిల్లా తాడిప‌త్రి ఎమ్మెల్యే జె.సీ. ప్ర‌భాక‌ర్ రెడ్డి జ‌గ‌న్ పైన మండిప‌డ్డారు.
 
ముఖ్యమంత్రి చంద్ర‌బాబును చెప్పుల‌తో కొట్టాల‌ని అనంత‌పురంలో జ‌గ‌న్ కామెంట్ చేయ‌డంపై జేసీ మండిప‌డ్డారు. ఇది ప‌ద్ధ‌తి కాదంటూ, జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా తాను ఎవ‌రితోనైనా ప‌ది నిమిషాల్లో చెప్పులు వేయించ‌గ‌ల‌న‌న్నారు. జ‌గ‌న్ వ్యాఖ్యలతో అటు టీడీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు తెలుపుతున్నారు.
 

వెబ్దునియా పై చదవండి