జాతక వివరాలు చెప్పగలరు...

మంగళవారం, 28 ఫిబ్రవరి 2012 (17:30 IST)
వీర్రాములు

వర్మ: మీ కుమారుడు వర్మ విదియ బుధవారం, కుంభలగ్నము, ఆరుద్ర నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. భార్యస్థానాధిపతి అయిన రవి చతుర్థము నందు కుజునితో కలయిక వల్ల వివాహం ఆలస్యమైంది. 2013 నందు వివాహం అవుతుంది. ఇష్టకామేశ్వరీ దేవిని పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. 2013 నుంచి శని మహర్ధశ 19 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తుంది. పుష్యనీలం అనే రాయిని ధరించినట్లైతే పురోభివృద్ధి పొందుతారు.

గీత: మీ కుమార్తె గీత త్రయోదశి బుధవారం కుంభలగ్నము, పూర్వాషాఢ నక్షత్రం ధనుర్‌రాశి నందు జన్మించారు. భర్తస్థానము నందు బుధ, శుక్రులు ఉండటం వల్ల వివాహ విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని గమనించండి. 2012 ఆగస్టు నుంచి 2013 మార్చి లోపు మీకు వివాహం అవుతుంది. వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరం అని గమనించండి. ఉమామహేశ్వరుల కళ్యాణం చేయించండి. 2014 నుంచి కుజ మహర్ధశ ఏడు సంవత్సరములు, రాహు మహర్ధశ 18 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది.

షణ్ముఖి : మీ కుమార్తె షణ్ముఖి పంచమి ఆదివారం, కర్కాటకలగ్నము, హస్తనక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లచామంతి పూలతో శనిని పూజించినా శుభం కలుగుతుంది. భర్తస్థానాధిపతి అయిన శని అష్టమము నందు ఉండటం వల్ల మీ 26 లేక 27వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. యోగ్యుడైన భర్త లభిస్తాడు.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి