నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?నా భవిష్యత్ వివరాలు చెప్పరూ...
శనివారం, 10 మార్చి 2012 (17:28 IST)
బి. శ్రీమాధురి-హైదరాబాద్:
మీరు త్రయోదశి శుక్రవారం వృశ్చికలగ్నము రేవతి నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల మంచి మంచి అవకాశాలు చేతిదాకా వచ్చి చేజారిపోతాయి. రాజ్యస్థానము నందు గురు, శని, రాహువులు ఉండటం వల్ల 2013 జూలై తదుపరి మీకు మంచి అవకాశాలు లభిస్తాయి.
2003 నుంచి శుక్ర మహర్ధశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2013 నుంచి 2023 వరకు సత్ఫలితాలను ఇవ్వగలడు. లలితా సహస్రనామం చదివినా లేక విన్నా సర్వదోషాలు తొలగిపోతాయి.