నాగరవి మీకు.. 2013 నుంచి సత్కాలం ప్రారంభమవుతోంది..
గురువారం, 29 మార్చి 2012 (16:35 IST)
FILE
నాగరవి-అనంతపురం:
మీరు చతుర్ధశి గురువారం, కర్కాటకలగ్నము, ఉత్తరాషాఢ నక్షత్రం ధనుర్‌రాశి నందు జన్మించారు. రాజ్యాధిపతి, ఉద్యోగకారకుడైన కుజుడు పంచమము నందు ఉండటం వల్ల మంచి మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. జాగ్రత్త వహించండి.
2013 నుంచి సత్కాలం ప్రారంభమవుతుంది. 2013 నుంచి గురు మహర్ధశ 16 సంవత్సరాలు అనగా 2029 వరకు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలదు. 2013 నందు మార్పు అభివృద్ధిని పొందుతారు. వెంకటేశ్వర స్వామిని పున్నాగ పూలతో పూజించండి. శుభం కలుగుతుంది.