మీరు పాడ్యమి ఆదివారం వృశ్చికలగ్నము చిత్తా నక్షత్రం తులారాశి నందు జన్మించారు. లగ్నము నందు కుజుడు ఉండి గ్రహబంధన దోషం ఏర్పడటం వల్ల, కర్కాటక కాల సర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించండి. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీశని త్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించినా సర్వదా శుభం కలుగుతుంది.
2003 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు 2014 నుంచి 2019 వరకు సత్ఫలితాలను ఇస్తాడు. తదుపరి శని మహర్ధశ 19 సంవత్సరములు మంచి అభివృద్ధిని యోగాన్ని ఇవ్వగలదు. పంచముఖ గణపతిని పూజించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. 2013 లేక 2014 నందు మీ సమస్యలు పరిష్కరించబడతాయి.