మీరు నవమి బుధవారం, మేషలగ్నము, స్వాతి నక్షత్రం తులారాశి నందు జన్మించారు. చతుర్ధాధిపతి అయిన చంద్రుడు భర్తస్థానము నందు ఉండటం వల్ల మీ 24 లేక 25 సంవత్సరము నందు వివాహం అవుతుంది. వ్యయస్థానము నందు గురు, రాహువులు ఉండి గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించబడటం వల్ల శేషనాగ సర్పదోష శాంతి చేయించండి.
2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 18 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించినా సర్వదా శుభం కలుగుతుంది. లక్ష్మీగణపతిని పూజించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి.