మీరు విదియ బుధవారం సింహలగ్నము, జ్యేష్ట నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. భార్యస్థానాధిపతి అయిన శని ధన స్థానము నందు ఉండటం వల్ల అష్టమాధిపతి అయిన గురువుతో కలయిక వల్ల వివాహం ఆలస్యమయింది. 2012 అక్టోబర్ నుంచి 2013 మే లోపు మీకు వివాహం అవుతుంది. వివాహానంతరం మీరు బాగా అభివృద్ధి చెందుతారు.
ప్రతీరోజూ ఈశ్వర ఆరాధన వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. 2001 నుంచి శుక్రమహర్ధశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2013 అక్టోబర్ నుంచి 2012 వరకు మంచి యోగాన్ని ఇవ్వగలడు. 2019 వరకు ఏలినాచి శనిదోషం ఉన్నందువల్ల 17సార్లు నవగ్రహ ప్రదక్షణ ప్రతీ శనివారం చేసి మీకు సర్వదా శుభం కలుగుతుంది. గరుడపచ్చ అనే రాయిని ధరించండి మీకు కలిసివస్తుంది.