మీరు షష్ఠి బుధవారం, మకరలగ్నము, అశ్వని నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. సంతానస్థానాధిపతి అయిన శుక్రుడు రాహు, కుజులతో కలయిక వల్ల సంతాన విషయంలో అప్రమత్తత చాలా అవసరం.
భార్య స్థానము నందు బుధ, గురులు ఉండటం వల్ల కుటుంబాధిపతి అయిన శని అష్టమము రవితో కలిసి హస్తగతం అయిపోవడం వల్ల కుటుంబ సౌఖ్యం తగ్గడం, అశాంతి, చికాకులు, పరస్పర అవగాహనలోపం వంటివి ఉండగలవు.
ఈ దోష నివారణకు ఈశ్వర ఆరాధన వల్ల సర్వదా శుభం కలుగుతుంది. 2014 వరకు చంద్రమహర్ధశలో ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. తదుపరి కుజ మహర్ధశ ఏడు సంవత్సరాలు సత్ఫలితాలను ఇవ్వగలదు.