మీరు అమావాస్య బుధవారం ధనుర్ లగ్నము, స్వాకి నక్షత్రం తులారాశి నందు జన్మించారు. లాభస్థానము నందు రవి, బుధ, శుక్ర, కుజ, చంద్రులు ఉండటం వల్ల మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 18 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నీలపు శంఖుపూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి.
2014 వరకు శని మహర్ధశ సామాన్యమైన యోగాన్ని ఇస్తుంది. 2012 లేక 2013 నందు మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఓర్పు, నేర్పు, సహనంతో ముందుకు సాగండి. 2014 నుంచి బుధమహర్ధశ 17 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలదు. సంకల్ప సిద్ధి గణపతిని పూజించడం వల్ల, సర్వదోషాలు తొలగిపోతాయి.