ప్రభుత్వోద్యోగం చేస్తున్నా.. కానీ గృహయోగం కలుగలేదు..
శనివారం, 3 మార్చి 2012 (15:41 IST)
పార్వతీదేవి- హైదరాబాద్ :
మీరు పంచమి ఆదివారం, మేషలగ్నము, ఆరుద్ర నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. 2012 ఆగస్టు వరకు అర్ధాష్టమ శని ప్రభావం ఉండటం వల్ల, మంచి మంచి అవకాశాలు చేజార్చుకోవడం, ఆందోళనలు వంటివి ఎదుర్కొంటున్నారు.
ప్రతీరోజూ లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది. 2008 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2013 నుంచి 2025 వరకు యోగాన్ని, స్థిరాస్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు.