తిరుమలరెడ్డి.. మీ కుమారుడు తిరుమలరెడ్డి త్రయోదశి శనివారం మిథునలగ్నము, స్వాతి నక్షత్రం తులారాశి నందు జన్మించారు. లగ్నము నందు కుజుడు ఉండటం వల్ల మంచి పట్టుదలతోనూ, కృషితోనూ అనుకున్నది సాధిస్తారు.
2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల మూడు నెలలకు ఒకసారి శనికి తైలాభిషేకం చేయించి 17సార్లు నవగ్రహ ప్రదక్షణ చేయించినా దోషాలు తొలగిపోతాయి.
ఈ దోషం వల్ల ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయడం, కోపం, చికాకు, ఆందోళనలు ఉండగలవు. 2003 నుంచి శని మహర్ధశ ప్రారంభమైంది. ఈ శని 2014 నుంచి 2022 వరకు మంచి యోగాన్ని ఇవ్వగలదు. 27 లేక 28వ సంవత్సరము నందు వివాహం అవుతుంది.
సంతోషకుమార్ రెడ్డి: మీ కుమారుడు సంతోషకుమార్ రెడ్డి పాడ్యమి బుధవారం వృశ్చికలగ్నము, శతభిషా నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. భార్యస్థానాధిపతి అయిన శుక్రుడు లాభస్థానము నందు ఉండటం వల్ల వివాహానంతరం మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. మీ 27లేక 28వ సంవత్సరము నందు వివాహం అవుతుంది.
వాక్ స్థానము నందు కుజుడు ఉండటం వల్ల అందరికీ సహాయం చేసి మాటపడతారు. జాగ్రత్త వహించండి. 2019 శని మహర్ధశ 19 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలదు. ఆదిశంకరుడిని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి.