మీ వివాహ విషయంలో జాతక పొంతనలు చాలా అవసరం

మంగళవారం, 28 ఫిబ్రవరి 2012 (17:58 IST)
FILE
సుప్రజగారు... మీరు చవితి, ఆదివారం, వృషభలగ్నం, భరణి నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. చతుర్థ స్థానము నందు బుధ, శుక్ర, కుజులు ఉండటం వల్ల, మీకు కార్పొరేట్ సంస్థల్లోను, ట్రేడింగ్ సంస్థల్లోను మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.

లాభాధిపతి అయిన బృహస్పతి భర్తస్థానము నందు ఉండటం వల్ల మంచి యోగ్యుడు, ఉత్తముడు, ఉద్యోగస్తుడు అయిన భర్త లభిస్తాడు. 2012 మే నుండి 2013 ఫిబ్రవరి లోపు మీకు వివాహం అవుతుంది. లగ్నము నందు రాహువు ఉండటం వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరం అని గమనించండి.

2013 డిశంబర్ వరకు సామాన్యంగా ఉండగలదు. 2014 నుండి కుజమహర్దశ 7 సంవత్సరములు, రాహుమహర్దశ 18 సంవత్సరములు మంచి యోగాన్ని, అభివృద్ధిని ఇవ్వగలదు. ఆర్థికాభివృద్ధికి, పురోభివృద్ధికి, సంకల్పసిద్ధికి స్టార్‌ రూబి అనే రాయిని 7 క్యారెట్లు ధరించిన శుభం కలుగుతుంది. వరసిద్ధి వినాయకుని గరికతో పూజించండి. సంకల్పం సిద్ధిస్తుంది.

వెబ్దునియా పై చదవండి