మీరు తదియ మంగళవారం, వృషభలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. 2012 ఆగస్టు వరకు అష్టమ శని ప్రభావం ఉండటం వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను, మానసిక అశాంతి, చికాకులను ఎదుర్కొంటున్నారు. 2012 ఆగస్టు తదుపరి మీకు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోండి.
2013 నందు అభివృద్ధి కానవస్తుంది. 2007 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2013 జూన్ నుంచి 2024 వరకు యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలడు. ప్రతీరోజు హనుమాన్ ఆరాధన వల్ల ఆటంకాలు తొలగిపోతాయి.