వరప్రసాద్.. మీరు ఆరోగ్య గణపతిని ఎర్రని పూలతో పూజించండి
మంగళవారం, 13 మార్చి 2012 (15:14 IST)
వరప్రసాద్-కరీంనగర్:
మీరు పంచమి శనివారం, మృగశిరా నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. చతుర్థస్థానము నందు కుజ, గురు, శని, రాహువులు ఉండటం వల్ల గ్రహబంధన దోషం ఏర్పడటం వల్ల ఆరోగ్యములో చికాకులు, అశాంతి, చికాకులు ఎదుర్కొంటున్నారు. ఈ దోష నివారణకు శంఖపాలకాల సర్పదోష శాంతి చేయించండి.
2014 మంచి మీరు ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు. 2018 వరకు గురు మహర్ధశ సామాన్యమైన యోగాన్ని ఇస్తుంది. తదుపరి శని మహర్ధశ 19 సంవత్సరాలు మంచి యోగాన్ని ఇస్తుంది. ఆరోగ్య గణపతిని ఎర్రని పూలతో పూజించండి. సర్వదా శుభం కలుగుతుంది.