మీరు షష్ఠి బుధవారం మకరలగ్నము, అశ్వని నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. తృతీయ వ్యయాధిపచి అయిన బృహస్పతి భార్యస్థానము నందు ఉండటం వల్ల, షష్ఠ భాగ్యాధిపతి అయిన బుధుడు భార్యస్థానము నందు ఉండటం వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరమని గమనించండి.
ఒక సంబంధం అనుకుని ఆగిన తర్వాత మీకు వివాహం అవుతుంది. 2014 వరకు చంద్ర మహర్దశ ఉంది. ఈ చంద్రుడు చికాకు, ఆందోళనలు వంటివి ఇస్తాడు. 2014 నుంచి కుజ మహర్ధశ ఏడు సంవత్సరాలు రాహు మహర్ధస 18 సంవత్సరాలు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇస్తాడు. కార్తికేయుడిని పూజించడం శుభప్రదం.