మీరు చతుర్ధశి మంగళవారం, సింహలగ్నము, శతభిషా నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించబడటం వల్ల శంఖచూడాకాల సర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించండి. 2013లోపు మీరు చదువుల్లో ఏకాగ్రత వహించినా శుభం కలుగుతుంది.
2013 లేక 2014 నందు కార్పొరేట్ సంస్థల్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో గానీ స్థిరపడే అవకాశం ఉంది. మీ 28 లేక 29వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. 2011 ఆగస్టు నుంచి శని మహర్ధశ ప్రారంభమైంది. ఈ శని మహర్ధశ 2013 నుంచి 2030 వరకు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తుంది. ప్రసన్నాంజనేయ స్వామిని పూజించడం వల్ల శుభఫలితాలుంటాయి.