సునీత గారూ.. మీకు 2012 లేదా 2013లో పుత్రప్రాప్తి కలదు..

గురువారం, 12 ఏప్రియల్ 2012 (16:48 IST)
FILE
సునీత - యుఎస్ఎ:

మీరు తదియ గురువారం, వృషభలగ్నము, పునర్వసు నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. 2012 ఆగస్టు వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల, ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందడం, అందరికి సహాయం చేసి మాటపడటం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 2012 లేదా 2013 నందు పుత్ర ప్రాప్తి కలదు. ప్రతీరోజూ లక్ష్మీగణపతిని పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది, 2010 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2013 ఏప్రిల్ నుంచి మంచి యోగాన్ని ఇస్తాడు. 2012 మే తదుపరి మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. 2013 లేక 2014 నందు గ్రీన్‌కార్డు లభిస్తుంది. 2014 లేక 2015 నందు ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. మీకు అన్ని విధాలా శుభదాయకంగా ఉంటుంది.

మీ భర్త సంపత్‌కుమార్ గారు.. పాడ్యమి శుక్రవారం కుంభలగ్నము, ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి నందు జన్మించారు. ధనస్థానము నందు కేతువు ఉండటం వల్ల, అష్టమస్థానము నందు భాగ్యాధిపతి అయిన శుక్రుడిని, రాజ్యాధిపతి అయిన కుజుడిన రాహువు పట్టడం వల్ల కర్కోటక కాలసర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించండి. 2014 చివరి వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 17సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లనిపూలతో శనిని పూజించినట్లైతే మీకు సర్వదా శుభం కలుగుతుంది. 2012 ఫిబ్రవరి నుంచి రవి మహర్దశ ప్రారంభమైంది. ఈ రవి ఆరు సంవత్సరములు, తదుపరి చంద్రుడు 10 సంవత్సరములు మంచి యోగాన్ని ఇవ్వగలడు.

మీ కుమార్తె సాహితి : తదియ బుధవారం వృశ్చికలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ మాస శివరాత్రికి ఈశ్వరునికి అభిషేకం చేయించినట్లైతే మీకు శుభం కలుగుతుంది. వైద్యం లేక సైన్స్ రంగాల్లో బాగా రాణిస్తారు. తల్లి, తండ్రిని బాగా గౌరవిస్తారు. మంచి పట్టుదల మొండితనంతో అనుకున్నది సాధిస్తారు.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి