సురేంద్ర గారూ.. శనిని పూజించినట్లైతే దోషాలు తొలగిపోతాయి..

FILE
సురేంద్ర-కాకినాడ :

మీరు సప్తమి శనివారం, సింహలగ్నము, విశాఖ నక్షత్రం తులారాశి నందు జన్మించారు. లగ్నము రవి, బుధ, కుజులు ఉండటం వల్ల, భార్యస్థానము నందు బృహస్పతి ఉండటం వల్్ల వివాహం మీకు ఆలస్యము అయింది. మీ 37 లేక 38 సంవత్సరము నందు వివాహం అవుతుంది.

భార్యస్థానాధిపతి అయిన శని లాభము నందు ఉండటం వల్ల వివాహానంతరం మీరు బాగా అభివృద్ధి చెందుతారు. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల మూడు నెలలకు ఒక శనివారంనాడు 16సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నూపూలతో శనిని పూజించినా దోషాలు తొలిగిపోతాయి.

వెబ్దునియా పై చదవండి