ఎమ్. శ్రీనివాసరావు గారూ.. మీ భవిష్య వివరాలివిగో...!

శుక్రవారం, 30 మార్చి 2012 (17:57 IST)
FILE
ఎమ్. శ్రీనివాసరావు-భీముని పట్నం:


మీరు త్రయోదశి సోమవారం ధనుర్ లగ్నము, ధనిష్ట నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. అష్టమాధిపతి అయిన చంద్రుడు ధనస్థానము నందు ఉండి, ఈ చంద్రుడిని రాహువు పట్టడం వల్ల ధనస్థాన దోషం ఏర్పడటం వల్ల రాజ్యాధిపతి, ఉద్యోగకారకుడైన బుధుడు నీచి పొంది ఉండటం వల్ల చికాకు, ఆందోళనలు వంటివి ఎదుర్కొంటున్నారు.

2012 నవంబరు వరకు గురు దశ ఉన్నందువల్ల ఈ గురువు మీకు పెద్ద యోగాన్ని ఇవ్వడు. 2012 నవంబర్ నుంచి శని మహర్ధశ 19 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది. పరమేశ్వరుని పూజించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి.

మీ భార్య లత తదియ బుధవారం, వృశ్చికలగ్నము రేవతి నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శని త్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించినా శుభం కలుగుతుంది.

ధన, కుటుంబ, వాక్ స్థానము నందు రాహువు ఉండటం వల్ల, సాయిబాబా గుడిలో ఉండే దునిలో ప్రతీ గురువారం గుప్పెడు గరికెను వేసినా దోషాలు తొలగిపోతాయి. 2007 నుంచి చంద్ర మహర్ధశ ప్రారంభమైంది. ఈ చంద్రుడు 2013 ఫిబ్రవరి నుంచి 2017 వరకు సత్ఫలితాలను స్తాడు. ఈ కాలంలో ఆర్థికంగా బాగా అభివృద్ధిని పొందుతారు. గజలక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల శుభం కలుగుతుంది.

మీ కుమారుడు.. త్రయోదశి మంగళవారం, తులా లగ్నము శతభిషా నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. 2012 ఆగస్టు వరకు అష్టమ శని ప్రభావం ఉండటం వల్ల ఆరోగ్యములో చికాకులు వంటివి ఉన్నా నెమ్మదిగా సమసిపోతాయి.

చదువుల్లో బాగా రాణిస్తారు. సైన్స్ రంగాల్లో బాగా అభివృద్ధి చెందుతారు. మీ 24 లేక 25వ సంవత్సరము నందు బాగా స్థిరపడతారు. మీ 27 లేక 28వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. జ్ఞాన సరస్వతిని పూజించడం వల్ల మీకు సర్వదా శుభం కలుగుతుంది.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి