మీరు చతుర్దశి ఆదివారం, మిథునలగ్నము, శతభిషా నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. లాభస్థానము నందు రాహువు వుండి, గ్రహబంధన దోషం ఏర్పడటం వల్ల, సప్తమాధిపతి అయిన బృహస్పతి భాగ్యము నందు రవి, చంద్రులతో కలయిక వల్ల వివాహ దోషం ఏర్పడింది. విషధారాకాలసర్పదోషం శాంతి చేయించండి.
2012 ఆగస్టు వరకు అష్టమ శని ఉన్నందువల్ల ప్రతి శనివారం 18 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా శుభం కలుగుతుంది. 2000 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు 2013 జూన్ నుంచి 2016 వరకు యోగాన్ని ఇస్తాడు. 2013 నందు మీకు పునర్వివాహం అవుతుంది. 2016 నుంచి శని మహర్ధశ 19 సంవత్సరములు మంచి యోగాన్ని ఇవ్వగలదు. ఉమామహేశ్వరుల కళ్యాణం చేయించండి. కలిసివస్తుంది.