శ్రీకాంత్ గారూ.. మీకు 2014లో గృహయోగం ఉంది..

బుధవారం, 28 మార్చి 2012 (17:31 IST)
FILE
శ్రీకాంత్-హైదరాబాద్:

మీరు విదియ, మంగళవారం, వృషభలగ్నము, అనూరాధ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. భాగ్యరాజ్యాధిపతి అయిన శని లగ్నము నందు ఉండటం వల్ల, వాక్‌స్థానము నందు కేతువు ఉండటం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంది.

మీరు టీచింగ్ రంగాల్లో బాగా అభివృద్ధి చెందుతారు. 2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల, ప్రతీ శని త్రయోదశికి 19సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా శుభం కలుగుతుంది.

ఒక చెంచా గోధుమ నూక, పంచదార, ఒక స్పూను బియ్యపు నూక కలిపి ఈ మిశ్రమాన్ని నల్లచీమలు ఉండే ప్రాంతంలో వేయడం శుభం కలుగుతుంది. 2008 నుంచి శుక్ర మహర్ధశ ప్రారంభమైంది.

ఈ శుక్రుడు 20 సంవత్సరాలు మంచి అభివృద్ధిని ఇస్తాడు. 2012 మార్చి నుంచి 2028 వరకు సత్ఫలితాలను ఇవ్వగలడు. ప్రతిరోజూ విష్ణు సహస్రనామం చదవండి లేక వినండి మీకు శుభం కలుగుతుంది. 2013 లేక 2014 నందు గృహయోగం ఉంది.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి