ఆయుర్వేదం: మిరియాలతో ప్రమాదం.. జాగ్రత్త!

సోమవారం, 5 జనవరి 2015 (14:46 IST)
ఆయుర్వేదం ప్రకారం మిరియాలను మితంగా వాడాలి. ఎక్కువ మొత్తంలో మిరియాలను ఎడాపెడా వాడేస్తే తీవ్రపరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి ద్వారా అధిక మొత్తంలో నల్ల మిరియాలను తీసుకుంటే.. అవి ఊపిరితిత్తులకు చేటు కలిగించే అవకాశం ఉంది. 
 
ఒకవేళ మిరియాలు ఊపిరితిత్తులలో చేరటం వలన మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలలో ఇది జరగవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
సాధారణ స్థాయిలో సరేకానీ.. గర్భవతుల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మిరియాలను మితంగా వాడాల్సిందే. కానీ, గర్భవతులు, అధిక మొత్తంలో మిరియాలను తీసుకుంటే గర్భస్రావాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే నల్లమిరియాలను పరిమితంగా వాడకపోతే కోలన్ క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి