దేశంలో పెద్ద నోట్ల రద్దుతో నగర, పురపాలక సంస్థలకు కోట్ల రూపాయల మేరకు ఆదాయం వస్తోంది. దీనికి కారణం ఏంటో తెలుసా? సంవత్సరాల తరబడి పన్ను చెల్లించని బడా బాబులంతా.. తమ వద్ద ఉన్న చెల్లని నోట్లతో పన్నులు చెల్లించడమే. గతంలో పోల్చితో ఇపుడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చి చేరుతోంది. ఈ ఆదయం పెరుగుల అక్షరాలా 268 శాతంగా ఉంది.
హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన మున్సిపాలిటీల్లో పన్ను చెల్లింపులు ఎంతలా పెరిగాయో ఈ వివరాలే కళ్లకు కట్టినట్టు చెబుతున్నాయి. జీహెచ్‌ఎంసీకి నవంబర్ 2015లో 8 కోట్ల రూపాయల పన్ను చెల్లింపుల ద్వారా ఆదాయం సమకూరగా, నవంబర్ 22 తేదీ నాటికి 208 కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లింపులు జరిగాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై మున్సిపాలిటీ పరిధిలో గత సంవత్సరం రూ.3,185 కోట్ల చెల్లింపులు జరగ్గా, ఈ సంవత్సరం రూ.11,913 కోట్ల ఆదాయం పన్నుల ద్వారా సమకూరింది.
సూరత్‌లో గత సంవత్సరం రూ.7.19 కోట్లు, నోట్ల రద్దు తర్వాత రూ.100 కోట్లు, అహ్మదాబాద్‌లో 2015 నవంబర్‌లో రూ.78 కోట్ల పన్ను చెల్లింపులు జరగ్గా, 2016 నవంబర్‌లో రూ.170 కోట్లు పన్నుల ద్వారా అహ్మదాబాద్ మున్సిపాలిటీ ఆదాయాన్ని గడించింది. కల్యాణ్ మున్సిపాలిటీ గత సంవత్సరం రూ.120 కోట్లు, ఈ నవంబర్‌లో 170 కోట్ల రూపాయలను పన్ను రూపంలో బడా బాబులు చెల్లించారు. ఈ ఐదు మున్సిపాలిటీలతో పాటు మరో 44 మున్సిపాలిటీల మొత్తం ఆదాయం అక్షరాల రూ.13,192 కోట్లు.