గిఫ్ట్‌లనేటివి మన వ్యక్తిగత భావాలకు తగ్గట్టుగా ఉంటుంది. ఒకవేళ మీరుకూడా కుటుంబంలోని పిల్లవానికి పుట్టిన సందర్భంగా ఏదో ఒక గిఫ్ట్‌ను ఇవ్వాలనుకుంటారు.
ముఖ్యంగా పిల్లలకు గిఫ్ట్‌లంటే చాలా ఇష్టం. వారికిచ్చే గిఫ్ట్‌లను చూసి పిల్లలు అప్పుడప్పుడూ మురిసిపోతుంటారుకూడా. అలాంటి చిన్ని పిల్లలకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో, మీకు కొన్ని సూచనలు మేము ఇక్కడ ఇస్తున్నాం. వాటిని అమలు చేయండి...
** ఇంట్లో శిశువు పుడితే వారి చేతుల ప్రింట్లు తీసుకుని ఆ ప్రింట్లను కళాత్మకంగా రూపొందించి శిశువుకు గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. దీంతో అవి మీమ్ములను చాలాకాలం గుర్తుంచుకోగలరు.
** చిన్ని శిశువు పేరు, వారి తల్లిదండ్రుల పేర్లు మొదలైనవి ఏదైనా గిఫ్ట్‌పై రాసి లేదా పెయింట్ చేసి ఆ పిల్లలకు గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు.
** అదే మీ శిశువుకు మీ సంతకంతో కూడిన అందమైన వ్రాతతో ఓ కథల పుస్తకంను గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు.
** శిశువు యొక్క ఫోటోను అందమైన ఫ్రేమ్‌తో అలంకరించి శిశువుకు గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు.
** చిన్ని శిశువుకు అందమైన ప్లేట్ లేదా అందమైన కప్పుపై శిశువు పేరును రాసి గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటంది.
** శిశువు యొక్క ఫోటోను స్క్యాన్ చేసి వారు వాడే బట్టలపై ముద్రించి ఇస్తే వారికి చాలా తృప్తి కలుగుతుంది. ఇలాంటి గిఫ్ట్‌లు పిల్లలకు ఇస్తే వారు వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు.