కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఐపీఎల్ బెట్టింగులో పాల్గొని కోట్లాది రూపాయలు నష్టపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పార్లమెంట్‌కు కూతవేటు దూరంలో జరగడం గమనార్హం. పార్లమెంట్‌కు దగ్గర్లో ఉన్న చెట్టుకు ఆ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది.