చేతి ఎముకకు పగులు... శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ధావన్ దూరం

మంగళవారం, 18 ఆగస్టు 2015 (10:22 IST)
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు కోలుకోలేని గట్టి దెబ్బతగిలింది. ఇప్పటికే తొలిటెస్టులో ఎదురైన అనూహ్య పరాజయం నుంచి కోలుకోక ముందే టీమిండియాకు మరో షాక్‌లాంటి వార్త ఇది. చేతి గాయంతో శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమయ్యాడు. చేతి గాయం కారణంగా ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని శిఖర్‌కు వైద్యులు సూచించారు. దీంతో ఓపెనర్ ధావన్ దూరమయ్యాడు. ఇప్పటికే అనివార్య కారణాల రీత్యా ఓపెనర్ మురళీ కార్తిక్ టెస్టుకు దూరమైన విషయంతెల్సిందే. తాజాగా శిఖర్ ధావన్ దూరం కావడం భారత్ గట్టి ఎదురుదెబ్బలాంటిది. 
 
తొలి టెస్టులో ఓ క్యాచ్ పట్టే ప్రయత్నంలో బంతి ధవన్ చేతికి బలంగా తాకడంతో ఎముకకు వెంట్రుక మందం పగులు ఏర్పడిందని, ఈ గాయం నుంచి కోలుకునేందుకు అతనికి 4 నుంచి 6వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇలా అర్థంతరంగా పర్యటన నుంచి నిష్క్రమిస్తున్నందుకు చాలా బాధగా ఉందని ధావన్ అన్నాడు. సిరీస్ మధ్యలో ఆటగాళ్లను వదిలి వెళ్తున్నందుకు నిరాశకు లోనయ్యానని, మళ్లీ గాయం నుంచి కోలుకొని రెట్టింపు ఉత్సాహంతో జట్టులోకి వస్తానని వ్యాఖ్యానించాడు. 

వెబ్దునియా పై చదవండి