జగ్మోహన్ దాల్మియా మహోన్నత వ్యక్తి.. మరణం తీరని లోటు: శ్రీనివాసన్

సోమవారం, 21 సెప్టెంబరు 2015 (16:11 IST)
బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మృతిపట్ల ఐసీసీ ఛైర్మన్ ఎన్. శ్రీనివాసన్ సంతాపం వ్యక్తం చేశారు. తన జీవితం మొత్తాన్ని క్రికెట్‌కే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి దాల్మియా అంటూ ప్రశంసించారు. అత్యుత్తమ స్పోర్ట్స్ మేనేజర్‌గా ఖ్యాతి గడించిన జగ్మోహన్ దాల్మియా మరణం క్రీడా ప్రపంచానికి తీరని లోటన్నారు. ముఖ్యంగా క్రికెట్‌కు ఆయన చేసిన సేవలు అసమానమైనవని, చిరస్థాయిగా నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. 
 
దాల్మియా దూరదృష్టి వల్లే క్రికెట్ ఈ స్థాయికి చేరుకుందన్నారు. తన జీవితం మొత్తాన్ని క్రికెట్‌కే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి దాల్మియా అంటూ ప్రశంసించారు. మన మధ్య దాల్మియా లేకపోవడం చాలా బాధ కలిగిస్తోందని తెలిపారు. 1997-2000 మధ్య కాలంలో ఐసీసీ అధ్యక్షుడిగా దాల్మియా క్రికెట్‌కు సేవ చేశారన్నారు.

మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియా మృతిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు. దాల్మియా మరణ వార్త తెలిసి షాక్‌కు గురయ్యానని.. బీసీసీఐని అత్యున్నత స్థాయికి చేర్చిన ఘనత దాల్మియాదేనని అరుణ్ జైట్లీ కొనియాడారు. తన వ్యక్తిగత స్నేహితుడి కోల్పోయానన్నారు. భారత క్రికెట్‌కు సంబంధించి తామిద్దరం ఎన్నో అంశాలపై చర్చించేవారమని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి