వృద్ధుల ఆలనా పాలనా చూసుకోవడం మన కర్తవ్యం: విరాట్ కోహ్లీ

శనివారం, 23 ఏప్రియల్ 2016 (10:11 IST)
వయసు మీదపడిన వాళ్లను కుటుంబ సభ్యులు వదిలేయడం ఏ మాత్రం భావ్యం కాదని టీమిండియా క్రికెటర్ విరాట్ తెలిపాడు. కుటుంబంలోని వృద్ధుల ఆలనాపాలన చూసుకోవడం మన కర్తవ్యమని విరాట్‌ పేర్కొన్నాడు. మైదానంలో ప్రత్యర్థులపై విరుచుకుపడే భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తన మనసు ఎంతో సునితమైనదో మరోసారి చాటుకున్నాడు. 
 
తనను ఎంతగానో ఆరాధించే సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలన్న ఆలోచనతో విరాట్‌ వృద్ధులకు చేయూత అందించాడు. ఇక్కడి ‘అభాల్మయ’ వృద్ధాశ్రమానికి ఆర్థిక సాయం చేసేందుకు అబిల్‌ ఫౌండేషన్‌తో విరాట్‌ కోహ్లీ ఫౌండేషన్‌ చేతులు కలిపింది. అంతే కాకుండా కోహ్లీ గురువారం స్వయంగా అభాల్మయ ఆశ్రయానికి వచ్చి అక్కడున్న 57 మంది వృద్ధులను ఆశ్చర్యపరిచాడు. వారిని ఆప్యాయంగా పలుకరించాడు.

వెబ్దునియా పై చదవండి