వరల్డ్ కప్ ఫైనల్ : మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్!

ఆదివారం, 29 మార్చి 2015 (10:08 IST)
వరల్డ్ కప్ ఫైనల్ పోటీలో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మహా సంగ్రామంలో న్యూజిలాండ్ జట్టు తన మూడో వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరు 39 పరుగులు వద్ద ఉండగా బ్యాట్స్‌మెన్ విలియమ్సన్ జాన్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 33 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్ ఒక ఫోరు సాయంతో 12 పరుగుల వద్ద కోల్పోయారు. అప్పటికి స్కోరు 12.2 ఓవర్లలో 39 పరుగులు. 
 
అంతకుముందు.. ఓపెనర్ గుప్తిల్ రూపంలో కివీస్ తన రెండో వికెట్‌ను కోల్పోయారు. మ్యాక్స్‌వెల్ వేసిన అద్భుతమైన బంతి వికెట్లను గీరాటేసింది. దీంతో ఓపెనర్ గుప్తిల్ 15 వరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. 
 
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలిన విషయం తెల్సిందే. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి కివీస్ జట్టు కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ మెక్‌కల్లమ్ డకౌట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు ఒక్క పరుగు మాత్రమే. మెక్‌కల్లమ్ డకౌట్ కావడంతో కివీస్ క్రికెట్ అభిమానులు ఒక్కసారి పూర్తి నిరాశకు లోనయ్యారు. ప్రస్తుతం విలియమ్సన్, రాస్ టేలర్‌లు క్రీజ్‌లో ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి