అంపైర్‌తో మరోసారి వివాదానికి దిగిన రికీ పాంటింగ్!

FILE
టెస్టు లేదా వన్డే పోటీల్లో అంపైర్లతో వివాదానికి దిగడం రికీ పాంటింగ్‌ సహజమైపోయింది. వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో ముగిసిన తొలి టెస్టులో నాలుగో రోజైన సోమవారం ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ అంపైర్‌తో వాగ్వివాదానికి దిగాడు.

మెక్‌కల్లమ్‌ ఎల్‌బీడబ్ల్యూని పాకిస్థాన్ అంపైర్ అజాద్ రవూఫ్ నిరాకరించారు. దీంతో రీకీ పాంటింగ్ మూడో అంపైర్ నిర్ణయాన్ని కోరాడు. కానీ మైదానంలో ఒక గంటకు 130కి.మీ వేగంతో గాలి వీచడంతో బంతి ఏ దిశకు చేరుకుందనే విషయాన్ని మూడో అంపైర్ సరిగ్గా నిర్ధారించలేకపోయారు. దీంతో మైదానంలో అంపైర్ ఇచ్చిన నాటౌట్ తీర్పునే మూడో అంపైర్ కూడా అంగీకరించారు.

ఫలితంగా మెక్‌కల్లమ్ ఎల్‌బీడబ్ల్యూను నాటౌట్‌గా నిర్ణయించారని రికీ పాంటింగ్ ఆగ్రహానికి గురైయ్యాడు. దీంతో పాటు అంపైర్ అజాద్‌తో వాగ్వివాదానికి దిగాడు.

ఈ సందర్భంలో రికీ పాంటింగ్‌కు సమాధానపరిచేందుకు మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ రంగంలోకి దిగాడు. గాలివేగంగా వీచడంతో బంతి దిశను కెమెరా సరిగ్గా నిర్ధారించలేకపోయిందని, అందుకే మైదానంలోని అంపైర్ నిర్ణయానికే మూడో అంపైర్ నిర్ధారించిందని నచ్చచెప్పాడు. కానీ రికీ పాంటింగ్ తరచూ అంపైర్లతో వివాదానికి దిగడంతో అతనిపై బ్లాక్ మార్క్ పడిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి