డర్బన్ టెస్ట్: రాణించిన ఆసీస్ ఓపెనర్లు

డర్బన్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్‌ రికీ పాంటింగ్ నిర్ణయం సరైనదే అని తమ బ్యాటింగ్‌తో నిరూపించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 184 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది.

ఇదిలావుండగా, ఓపెనర్లుగా బరిలోకి దిగిన సైమన్ కటిచ్, ఫిలిప్ హ్యూస్‌లు ఆరంభంలో ఆచితూచి ఆడారు. క్రీజ్‌లో పాతుకుపోయిన తర్వాత బ్యాట్‌కు పని చెప్పారు. కెరీర్‌లో రెండో టెస్ట్ ఆడుతున్న హ్యూస్ 151 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 115 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సైమన్ కటిచ్ (108) సెంచరీతో రాణించారు. తొలి రోజు 80 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మేకేల్ హస్సీ (37), మార్కస్ నార్త్ (17) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి