ద్రావిడ్, లక్ష్మణ్ కివీస్‌ పయనం

భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ రాహుల్ ద్రావిడ్, వీవీఎస్.లక్ష్మణ్‌లతో సహా నలుగురు భారత క్రికెటర్లు సోమవారం తెల్లవారు జామున న్యూజిలాండ్‌కు బయలుదేరి వెళ్లారు. ఈనెల 18వ తేదీ నుంచి కివీస్‌తో మూడు టెస్ట్ మ్యాచ్‌లను భారత్ ఆడనుండగా, ఇందుకోసం ప్రకటించిన 16 మంది జట్టు సభ్యుల్లో కొంతమంది ఇప్పటికే కివీస్‌లో ఉన్న విషయం తెల్సిందే.

కాగా... టెస్ట్ జట్టుకు ఎంపికైన వారిలో రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో సహా.. అమిత్ మిశ్రా, ఎల్.బాలాజీ, ధవల్ కులకర్ణి, ఎం.విజయ్‌లు న్యూజిలాండ్ బయలుదేరిన వారిలో ఉన్నారు. వీరందరూ మంగళవారం ఉదయానికల్లా అక్లాండ్‌కు చేరుకుంటారు.

ఇదిలా ఉంటే... ప్రస్తుతం కివీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఆడిన తొలి రెండు ట్వంటీ-20 మ్యాచ్‌లలో ఓటమి పాలైన సంగతి విదితమే. ఐదు వన్డేల సిరీస్‌ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సిరీస్ తర్వాత ఈనెల 18వ తేదీన తొలి టెస్టు ఆరంభమవుతుంది.

వెబ్దునియా పై చదవండి