సన్నీ, రిచర్డ్స్‌లు నా ఫేవరేట్స్ : మియాందాద్

భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, వెస్ట్ ఇండియన్ వీవియన్ రిచర్డ్స్‌లు ఇరువురూ తన ఫేవరేట్ ఆటగాళ్లని... పాకిస్థాన్ మాజీ స్కిప్పర్ జావేద్ మియాందాద్ పేర్కొన్నాడు. తాను ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాననీ, మరెందరికో స్ఫూర్తిగా నిలిచాననీ.. అయితే తనకు సన్నీ, రిచర్డ్స్‌లంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉందని జావేద్ అన్నాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన విశిష్ట క్రికెటర్ల జాబితాలో మియాందాద్‌కు చోటు లభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కరాచీలోని గాడాఫీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జావేద్ మాట్లాడుతూ... షార్జాలో భారత్‌పై అడిన ఇన్నింగ్స్ తన కెరీర్‌లోనే చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌ అని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో చివరి బంతికి సిక్సర్ కొట్టిన మియాందాద్ పాక్ జట్టును ఒంటిచేత్తో గెలిపించిన సంగతి విదితమే.

ఇదిలా ఉంటే... ఐసీసీ మొత్తం 55 మంది విశిష్టమైన క్రికెటర్ల జాబితాను తయారు చేసింది. అందులో మియాందాద్‌తో పాటు మరో పాక్ ఆటగాడు హనీఫ్ మహ్మద్ కూడా చోటు దక్కించుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి