వెల్లింగ్టన్‌లోని వెస్ట్‌ప్యాక్ స్టేడియంలో న్యూజిలాండ్-టీం ఇండియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే డై అండ్ నైట్ మ్యాచ్‌లో వర్షం కారణంగా నిర్ణీత 50 ఓవర్లను 34 ఓవర్లుగా కుదించారు. ఈరోజు ఉదయం ప్రారంభమైన ఆటకు రెండుసార్లు వర్షం ఆటంకం కలిగించటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రెండు సార్లు వర్షం అనంతరం ప్రారంభంమైన మ్యాచ్‌లో భారత్ 166 పరుగల వద్ద గౌతమ్ గంభీర్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. మొదట మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదించగా.. రెండోసారి వర్షంవల్ల మ్యాచ్ ఆగిపోవడంతో మళ్లీ నాలుగు ఓవర్లు తగ్గించి 34 ఓవర్లకు కుదించారు.
అంతకు ముందు టాస్ గెలిచి టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్‌గా బరిలో దిగిన వీరేంద్ర సెహ్వాగ్ 54 పరుగులతో బట్లర్ బౌలింగ్‌లో గ్లాసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ సచిన్ టెండూల్కర్ 61 పరుగులు చేసి వెటోరీ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూతో వెనుదిరిగాడు.
ఆ తరువాత వచ్చిన గౌతం గంభీర్ 30 పరుగుల వద్ద ఎలియట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఇక యువరాజ్ సింగ్ అయిత్ ఒక్క పరుగు కూడా చేయకుండానే మిల్స్ బౌలింగ్‌లో టేలర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం కెప్టెన్ ధోనీ 23, సురేష్ రైనా 13 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 28.4 ఓవర్లు ముగిసేసరికి టీం ఇండియా 188 పరుగులు సాధించింది.