కలిస్‌ను ప్రశంసించిన సచిన్ టెండూల్కర్!: విశ్రాంత జీవనం..

FILE
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్‌కు మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ నివాళి అర్పించారు. చక్కటి స్ఫూర్తితో క్రికెట్‌కు సేవలు అందించిన వ్యక్తిగా ప్రశంసించారు. 'జాక్వెస్ మీరు నిజమైన చాంపియన్.. విశ్రాంత జీవనం ఇబ్బందిగా ఏమీ ఉండదు' అంటూ సచిన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

కాగా భారత్‌తో సోమవారం ముగిసిన రెండో టెస్టు అనంతరం కలిస్ తన అంతర్జాతీయ టెస్టు జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి