పాకిస్థాన్‌లో శ్రీలంక క్రికెటర్లపై కాల్పులు

మంగళవారం, 3 మార్చి 2009 (10:18 IST)
పాకిస్థాన్ దేశంలో సామాన్య పౌరులకు మాత్రమే కాకుండా విదేశీ పౌరులకు సైతం రక్షణ లేదనే విషయం స్పష్టమైంది. ఆ దేశంలో పర్యటిస్తున్న శ్రీలంక టెస్టు క్రికెటర్లపై గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

అలాగే లంక ఆటగాళ్లలో కుమార సంగక్కర, అజంతా మెండీస్, సమరవీర, తరంగ, మహేళ జయవర్ధనేలు గాయపడ్డారు. అలాగే ముత్తయ్య మురళీధరన్ కూడా గాయపడినట్టు సమాచారం. గాయపడిన ఆటగాళ్ళ ప్రాణానికి ఎలాంటి ముప్పులేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన కారణంగా రెండో టెస్ట్‌ను రద్దు చేశారు. శ్రీలంక జట్టు క్రికెటర్లు ప్రయాణించే బస్సును సైతం పూర్తిగా ధ్వంసం చేశారు.

వెబ్దునియా పై చదవండి