పెంగ్‌షుయీతో వివిధ గదుల అమరిక

భారతీయ సాంప్రదాయంలో మానవుడి జీవితానికి వాస్తుకు దగ్గర సంబంధం ఉందని చెప్పచ్చు. ఇదిలా ఉండగా భారతీయ వాస్తుకు చైనా సాంప్రదాయాలకు దగ్గరి సంబంధం ఉందనే విషయాన్ని తేల్చిచెబుతున్నారు. భారతీయ వాస్తు శాస్త్రంలో చైనీయుల పెంగ్‌షియీ కూడా ఒక భాగంగా మిళితమైంది. వాస్తును అనుకరించే వారంతా పెంగ్‌షుయీ శాస్త్రాన్ని కూడా అవలంభించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

పెంగ్‌షుయీ ప్రకారం కార్యాలయాలు, పడకగదులు ఎలా ఉండాలో ఆ శాస్త్రం ఇలా వివరించింది. ఇంట్లో ఉన్నప్పడు ఎక్కువ మంచంపై, కార్యాలయంలో ఉన్నప్పడు బల్లపై అధికంగా ఉంటాడు కాబట్టి మంచం, బల్ల ప్రభావం మనిషి ఆరోగ్యంపై అధికంగా ఉంటుంది.

అందువల్ల పడకగదిలోగాని కార్యాలయంలోగాని మంచం, బల్లలు గోడకు దూరంగా వేసుకోవాలి. కిటికీలను కర్టెన్లతో మూసివేయాలి. లేదంటే బయటి వెలుతురు ఆయా గదుల్లో మనుషులపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తలుపువైపు వీపుపెట్టి కూర్చోకూడదు. అలాగని తలుపువైపు ముఖం పెడుతూనూ కూర్చోకూడదు.

అంతేకాకుండా నిద్రించేటప్పుడు గదిలోని బీరువాలు మనిషి వైపుకు చూస్తున్నట్లు ఉండకూడదు. అలాగే ఆయా గదుల్లో విశాల అద్దాలు ఉండకూడదు. ప్రశాంత వాతావరణాన్ని కలిగించే నీలి రంగులను ఆయా గదులకు వాడితే మంచిదని పెంగ్‌షుయీ శాస్త్రం వివరిస్తోంది.

వెబ్దునియా పై చదవండి