ఫెంగ్‌షుయ్ ప్రకారం వస్తువుల అమరిక!

మంగళవారం, 15 జులై 2008 (17:49 IST)
WD
ఇంటి నిర్మాణంలో ఫెంగ్‌షుయ్ ప్రకారం వస్తువులను అమర్చుకోవడం ద్వారా కొన్ని సమస్యల నుంచి దూరం కావచ్చునని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అలాగే వాస్తు పేర్కొంటున్న కొన్ని అలంకరణలను గురించి ఫెంగ్‌షుయ్ అనేక నియమ నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం ఇంట్లో ప్రధాన గది అయిన పడకగదిలో ఎలాంటి వస్తువులను అమర్చుకోవాలన్న అంశాన్ని గురించి పరిశీలిద్దామా... పడకగదిలో విద్యుత్ పరికరాలను వీలైనంత దూరంలో పెట్టుకోవాలి.

ఎందుకంటే వాటి నుంచి విడుదలయ్యే విద్యుత్ తరంగాలు శరీరంపై ప్రభావం చూపుతాయి. అదేవిధంగా నిద్రించే సమయంలో విద్యుత్ పరికరాలకు సమీపంలో ఉండకుండా, గుమ్మం ముందు కాళ్లు పెట్టి నిద్రించకూడదని ఫెంగ్‌షుయ్ అంటోంది. అలాగే పడకగదిలో భార్యాభర్తల ఫోటోతోపాటు బాతుల జంట బొమ్మలను కలిపి పెట్టుకుంటే మంచిది.

పడకగదిలో ఆక్వేరియం వంటి అధిక నీటి నిలువ వస్తువులు ఉండకూడదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం పేర్కొంటుంది. అదేవిధంగా డైనింగ్ టేబుల్ వద్ద ఒంటరిగా కూర్చుని భోజనం చేయకూడదని, కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయటం మంచిది. ఇకపోతే ఇక బాత్‌రూమ్ విషయానికొస్తే... టాయిలెట్, బాత్ రూమ్‌లలో ఆకుపచ్చని మొక్కలను పెంచుకోవచ్చునని ఫెంగ్‌షుయ్ శాస్త్రజ్ఞులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి