కొత్త ఇంటిలోనికి మారుతున్నారా....

శుక్రవారం, 14 మార్చి 2008 (19:08 IST)
ఫెంగ్‌షుయ్ వాస్తు శాస్త్రంలో పలు నియనిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా మనలో చాలామంది ఉద్యోగరీత్యా తరచూ ఇళ్లు మారుతుంటాం. ఇలా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడల్లా ఆ ఇంట్లో ఓ గంధపు అగరవత్తి వెలిగించాలంటుంది ఫెంగ్ షుయ్. ఇలా చేయటం వల్ల ఆ గృహంలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తి పోతుందని నమ్మకం.

అదే విధంగా పాత ఇంట్లో సామాన్లను విరిగినవాటితో సహా కొత్త ఇంటికి తీసుకెళ్లటం చేసే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఇలా చేయవద్దని చెపుతోంది ఫెంగ్ షుయ్. విరిగిపోయిన, పాడైపోయిన సామాన్లను అక్కడే వదిలేయటం మంచిదంటుంది. ఒకవేళ వాటిని వదిలేయటం ఇష్టం లేకపోయినట్లయితే, సదరు సామానులను బాగు చేయించి తీసుకెళ్లండి.

వెబ్దునియా పై చదవండి