ఫెంగ్‌షుయ్‌తో మంగళకరమైన పూజగది

ఫెంగ్‌షుయ్ వాస్తు శాస్త్రాన్ని అనుసరించి పూజగదిని నిర్మించవచ్చు. గృహంలోపల పూజగదిని ఈశాన్యం దిశలో పెట్టుకోవాలి. ఒకవేళ గృహం చిన్నదిగా ఉంటే పెట్టకపోవడం మంచిది. వంటగదికి ఈశాన్యంలోనూ, తూర్పులోనూ, తూర్పు ఈశాన్యంలోనూ, ఉత్తర ఈశాన్యంలోనూ ఫెంగ్‌షుయ్ రీత్యా పూజగదిని పెట్టుకోవచ్చు.

మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వాయవ్యంలో పూజ గది పెట్టుకొనే సంప్రదాయం ఉంది. ఇల్లు చిన్నదిగా ఉన్నపుడు పూజగది పెట్టడానికి వీలు కానపుడు గోడలో అలమార చేయించి పూజకు ఉపయోగించవచ్చు. తూర్పు, ఉత్తర గోడలను రెండింటిని కలుపుతూ ఈశాన్యం తెగునట్లుగా అలమార పెట్టడం ఫెంగ్‌షుయ్ శాస్త్రం ప్రకారం మంచిది కాదు.

ఓకే గదిలో నివాసించేవారు గదికి ఈశాన్యంలో దేవుని పటాలు పెట్టుకొని కర్టెన్‌లాంటిది వేసుకోవాలి. సిమెంటు పలకలు లేదా చెక్కతో చేయించిన పలకలమీద దేవుని పటాలు పెట్టుకోవాలి. తూర్పు దిశకు చూస్తూ ప్రార్థన చేయాలి. అలా వీలుకానప్పుడు ఉత్తరం వైపు తిరిగి ప్రార్థించవచ్చని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి