మన ఇంటికి అందాన్నిచ్చేవి మెట్లని చెప్పవచ్చు. అలాగే ఇంటిలోపలికి వెళ్లాలంటే మెట్లు తప్పనిసరిగా ఉండాలి. కొన్ని ఇళ్లలో అయితే ఇంటి లోపల నుంచే పైకి అందంగా మెట్లుంటాయి. రెండు అంతస్తులు, మూడు అంతస్తులు గల మరి కొన్ని ఇళ్లలో అయితే మెట్లు ఎక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది. మరి ఆ మెట్ల అమరికలో పాటించాల్సిన నియమాలను చూద్దామా
మీ ఇంట్లో ఉండే మెట్లపై వెలుతురుకు సరిగ్గా ఉండేట్టు జాగ్రత్తలు తీసుకోండి. లేకుంటే చీకటిలో మెట్లు కనిపించక కింద పడే అవకాశం ఉంది. అంతే కాకుండా చీకటి దారిద్రానికి చిహ్నంగా చెప్తుంటారు. అలాగే మీ పార్కింగ్ స్థలాల్లో కూడా వెలుతురు ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం ద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుంది.
అలాగే మీ మెట్లు చిన్నగా ఉంటే వాటికి ఎదురుగా ఓ అద్దం పెట్టడం ద్వారా మీ సమస్యను అధిగమించవచ్చు. అలాగే చాలామంది తమ మెట్ల మధ్య ఖాళీ ఉండేటట్టు కట్టుకుంటుంటారు. ఇంట్లో స్టైలిష్‌గా ఉంటాయని అలా పెట్టుకుంటుంటారు. అవి మెటాలిక్‌వైతే ఫర్వాలేదు కానీ సున్నపురాయితో చేసిన మెట్లైతే మాత్రం మధ్యలో చెక్కలతో కానీ సిమెంట్‌తో కానీ పూరించడం మంచిది.
మీ మెట్ల వద్ద ఉండే ఆఖరి మెట్టు దగ్గిర అంటే మీ ఇంటి ద్వారం దగ్గిర అందమైన పెయింటింగ్స్ లాంటివి పెడితే చాలా మంచిది. అందమైన ప్రకృతి దృశ్యాలు, పువ్వులు ఉన్న పెయింటిగ్స్ పెట్టండి. మీ మెట్ల అమరికలో పై నియమాలను పాటించి చూడండి విజయం మీదే అవుతుంది.