గృహానికి ముఖ్యమైనది సింహద్వారం. ఈ ద్వారంలోంచి ఇంట్లోకి వచ్చేవారికి చాలా ఆహ్లాదంగా ఉండాలి కదా మరి. ఇందుకోసం మీరు చాలా నియమాలను పాటిస్తుంటారు కదా. అయితే ఫెంగ్‌ష్యూయ్ సూత్రాలను పాటించి చూడండి. మార్పును మీరే గమనిస్తారు
మీ ఇంటి సింహద్వారం ముందు అంటే బయట, లోపల ఎటువంటి అడ్డాలు, అవరోధాలు లేకుండా చూసుకోండి. చెత్తా, చెదారం, చెప్పులు తదితరాలు ప్రక్కగా ఓ వరుసలో ఉంచుకోండి. ఎందుకంటే మీ ఇంటిలోకి వచ్చే శక్తికి ఇవి అడ్డు పడే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా మీ చెప్పులకు, బూట్లకు ఉన్న దుర్వాసనను తీసుకురావడంతో చెడు శక్తులు ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది.
మీ హాలులో ఫౌంటెన్, అక్వేరియం లాంటివి ఉంటే మంచిది. మీ ఇంట్లోకి వచ్చే శక్తి నీటి కోసం వెతుకుతుంది కాబట్టి వీటిని ఉంచుకుంటే మంచిది. అలాగే మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా మెట్లు, వాటర్ ట్యాంక్, చెట్లు, చర్చి లేదా గుడి, పొయ్యి, టాయ్‌లెట్, విద్యుత్ స్థంభాలు వంటివి ఉండకుండా చూసుకోండి. అవి ఉన్నట్టైతే ద్వారంపైన బాఝువ యంత్రాన్ని ఉంచడం మంచిది.
అలాగే మీ సింహద్వారానికి రెండు వైపులా చక్కని సువాసనలు కలిగించే పూల మొక్కలు ఉంచండి. వీలైతే సింహద్వారంపైన జీరో వాట్ల బల్బు ఉంచండి. ఎప్పుడూ వెలిగేలా చూసుకోండి. పైన పేర్కొన్న విషయాలను దృష్టిలో ఉంచుకుని సింహద్వారాన్ని అలంకరించుకోండి.