కొలెస్ట్రాల్‌ను తగ్గించే గ్రీన్ టీని రోజూ తీసుకోండి
FILE
ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు గ్రీన్ టీలో ఉన్నాయని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. రోజువారీగా గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చునని ఆ అధ్యయనం తేల్చింది. బీజింగ్‌లోని పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజీ నిర్వహించిన అధ్యయనాన్ని డెయిలీ ఎక్స్‌ప్రెస్ ప్రచురించింది.
ఈ అధ్యయనంలో రోజూ గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా శరీరంలోని అనవసరమైన క్రొవ్వు పదార్థాల స్థాయిని తగ్గిస్తుందని తెలియవచ్చింది. అయితే ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థాలను గ్రీన్ టీ సేవనం ద్వారా కాపాడుకోవచ్చునని యూనియన్ మెడికల్ కాలేజీ పరిశోధకులు వెల్లడించారు. 14 ర్యాండమ్ ట్రయల్స్‌లో గ్రీన్ టీ సేవనం ద్వారా 7.2 మి.గ్రాముల కొలెస్ట్రాల్ తగ్గిందని తెలిసింది.