పొట్టను పెంచొద్దు.. హైబీపీని కొని తెచ్చుకోవద్దు!

మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (17:42 IST)
పొట్టను పెంచొద్దు.. రోగాలను తెచ్చుకోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మన దేహంలో ఉదరం వద్ద కొవ్వు పేరుకుపోవడంతోనే రోగాలు తప్పట్లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొట్ట భాగంలో పొరలు పొరలుగా పేరుకుపోయిన కొవ్వే అధిక వ్యాధులకు కారణమవుతుందని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌కు చెందిన అస్లాన్ ట్యూరర్ అనే పరిశోధకుడు అంటున్నారు. 
 
పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువైతే, అది అధిక రక్తపోటుకు దారితీస్తుందని తెలిపారు. ఒకే బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) స్థాయి కలిగిన ఉన్న వ్యక్తులను పోల్చి చూస్తే, ఉదరం చుట్టూ కొవ్వు పేరుకున్న వ్యక్తులకే అధిక రక్తపోటు ముప్పు ఎక్కువగా ఉన్నట్టు తేలిందని చెప్పారు. 
 
ఈ అధ్యయనంలో భాగంగా 903 మంది రోగులను పరిశీలించారు. పొట్ట వద్ద కొవ్వుకు, హై బీపీకి సంబంధం ఉన్నట్లు తేలిందని ట్యూరర్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి