ఇలా చేస్తే మతిమరుపు మటుమాయం...!

సోమవారం, 22 డిశెంబరు 2014 (13:53 IST)
నేటి హర్రి...హర్రి... ప్రపంచంలో ఉరకలు పరుగులు తప్పవు. అయితే మతిమరుపు ఉంటే మాత్రం పలు రకాలుగా ఇబ్బందులు పడాల్సిందే. వంట పని పూర్తయ్యాక గ్యాస్ కట్ చేయడం దగ్గర నుంచి ఆఫీసుకు వెళ్లే సమయంలో ఇంట్లో మొబైల్ మరచిపోవడం వరకు అన్ని సమస్యలే. ఇటీవల కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు. మతిమరుపును జయించి మెండైన జ్ఞాపకశక్తిని పొందాలంటే..  కొన్ని చిట్కాలు పాటిస్తే సరి...
 
తొలుత మన చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటే.... అమ్మ అంగడికి పంపితే.. తాను ఏ వస్తువు తెమ్మందో దాన్నే నెమరేసుకుంటూ ఉంటాం. అంత మాత్రాన అది వెర్రితనం కాదు. తమతో తాము మాట్లాడుకునే వ్యక్తులకు డిమెంన్షియా వచ్చే అవకాశాలు సన్నగిల్లినట్టు ప్రయోగాల్లో వెల్లడైంది. 
 
అంతేకాదండోయ్ మీకు మీరు కథలు చెప్పుకోవడం వల్ల మెమరీ లాస్‌ను తగ్గించటంతోపాటు రోజు వారీ పనులకు సంబంధించిన ముఖ్యమైన డిటెయిల్స్ పట్ల ఫోకస్ పెరుగుతుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి పెంపొందుతుంది.
 
కొత్త భాష నేర్చుకోవడం, పజిల్స్, పద బంధాలు పూరించడం, పాట సంగీతాన్ని గుర్తు పెట్టుకుని వీలైతే గొంతు కలిపి పాడడం, ఒకే సమయంలో వీలైనన్ని ఎక్కువ కథలు, లేదా నవలలు చదవడం, వేర్వేరు పుస్తకాల్లో వేర్వేరు మలుపులను గుర్తు పెట్టుకునేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తే మతిమరుపు సమస్య నుంచి బయటపడవచ్చునను నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి