లైంగిక సామర్థ్యంలేని కోరిక.. కత్తిలేని యుద్ధం వంటింది...

ఆదివారం, 18 నవంబరు 2018 (15:19 IST)
చాలామంది సమస్యలు అంగస్తంభన సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటివారు వైద్యులను సంప్రదించి తమ సమస్యలను చెప్పుకునేందుకు సంకోచిస్తుంటారు. ఫలితంగా తమలోతాము కుమిలిపోతుంటారు. తాను ఎదుర్కొంటున్న సమస్య కంటే పడక గదిలో భార్యను తృప్తి పరచలేకపోయామన్న భావన వారిని మరింతగా వేధిస్తూ ఉంటుంది. 
 
దీంతో తమ స్నేహితులు ఇచ్చే సూచన మేరకు ఒకటి రెండు పెగ్గులు మద్యం సేవించి పడకగదిలోకి వెళతారు. తీరా అక్కడకు వెళ్లాక మొదటికే మోసం వస్తుంది. మద్యం మనసులో కోరికను పెంచుతుందేమోకానీ, శరీరంలో లైంగిక సామర్థ్యాన్ని మాత్రం దెబ్బతీస్తుంది. అంటే ఈ చర్య సామర్థ్యంలోని కోరిక.. కత్తి లేని యుద్ధం వంటిది. 
 
అందువల్ల అంగ స్తంభన సమస్య ఉన్నవారు మద్యం సేవించడం మహా ప్రమాదకరమని వైద్యులు సలహా ఇస్తున్నారు. పైగా, దీర్ఘకాలంలో లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. మత్తుపదార్థాలు నేరుగా మెదడుపై పని చేస్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది. మనమీద మనకు నియంత్రణ ఉండదు. ఏ సమయంలో ఎలా స్పందించాలనే స్పృహ తగ్గిపోతుంది. ఇవన్నీ శృంగారనికి శత్రువులే. అందువల్ల మద్యం సేవించి పడక గదిలోకి వెళ్లడం అనేది సమస్యను మరింత జఠిలం చేసుకోవడమేనని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు