నేను ఫారిన్‌లో వున్నా... నా ప్రేయసి ఆ పని చేస్తుందేమోనని భయంగా వుంది...

గురువారం, 2 మే 2019 (17:19 IST)
ఢిల్లీలో నాకు ఉద్యోగం. అక్కడే ఓ అందమైన అమ్మాయి పరిచయమైంది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని ఆమె అడిగినా నాకు ఫారిన్ ట్రిప్ ఉండటంతో మరో ఏడాది తర్వాత చేసుకుందామన్నాను. ఐతే ఆమె, నేను రోజుకు రెండుసార్లు సురక్షిత శృంగారంలో పాల్గొనేవాళ్లం. ఒకవేళ నేను విశ్రాంతి తీసుకుందామని చెప్పినా అది లేకుండా ఆమె ఉండలేదు. నన్ను రెచ్చగొట్టి మరీ చేయించుకుంటుంది. ఇపుడు నేను విదేశీ పర్యటనలో 6 నెలలు ఉండాల్సి వస్తుంది. 
 
శృంగారమంటే అంత పిచ్చి ఉన్న నా గర్ల్ ఫ్రెండ్ మరెవరితోనైనా పాల్గొంటుందేమోనన్న ఆందోళనగా ఉంది. అప్పటికీ సిగ్గు విడిచి తనతో ఇదే విషయం చెప్పేశాను. ఆమె తను ఎవ్వరితో మాట్లాడననీ, నాతో మాత్రమే చేయాలనిపిస్తుందని చెప్పింది. ఆమె చాలా అందగత్తె. పైగా ఆఫీసులో ఇద్దరితో కాస్త చనువుగా ఉంటుంది. నేను ఉండనని తెలిసిన తర్వాత వారు నా గర్ల్ ఫ్రెండును లొంగదీసుకుంటారేమోనని భయంగా ఉంది. ఈ ఆందోళన నుంచి ఎలా బయటపడాలో తెలియడంలేదు...
 
మీది అర్థంలేని భయం. మీరు 6 నెలలు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. మీలానే మీ గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడ మీరు ఎవరి ప్రేమలోనైనా పడుతారేమో అని భయపడుతుందా... అదేమీ లేదు కదా. జీవితంలో భాగస్వామిగా చేసుకోదలచిన వ్యక్తిపై నమ్మకం ఉండాలి. మరొక వ్యక్తితో శృంగారంలో పాల్గొంటావేమోనన్న అనుమానాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే దానికి ఓపికగా ఆమె సమాధానం చెప్పినందుకు మీరు సంతోషించాలి. 
 
మరొకరెవరైనా అయితే చీవాట్లు తప్పకుండా పడేవి. మిమ్మల్ని ఛీకొట్టేసి మీ ముఖం చూడనని చెప్పేసేవారు. పెళ్లికి ముందు శృంగారం అనర్థాలకు దారి తీస్తుంది. అంతేకాదు ఇలాంటి అపోహలకు కూడా తావిస్తుంది. అందుకే పెళ్లికి ముందు ప్రేమికులు శారీరక సుఖాన్ని చవిచూడటం కంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పని చేసుకుంటే సంతోషంగా ఉంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు